లక్ష్మణచాంద: రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఆసరా పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, నేత, గీత, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారు. గతంలో వందల్లో ఉన్న పింఛన్‌ను కేసీఆర్ వేలకు పెంచారు.
గతంలో అరకొర....
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు నెల కు కేవలం రూ.70 పింఛన్ మాత్రమే ఇచ్చేది. ఇది దివ్యాంగులకు ఏ మాత్రం సరిపోయేది కాదు. దీంతో దివ్యాంగులు తమ కుటుంబ సభ్యులపైనే అ న్నింటికి ఆధారపడేవారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పింఛన్‌ను రూ.200 పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఇదే పింఛన్ అందించారు.
స్వరాష్ట్రంలో భారీగా పెంపు..
స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ నేటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, వితంతువులు, ఒంట రి మహిళలు, వివిధ కుల వృత్తుల వారికి ఇచ్చే పింఛన్లను రూ.1,016కు పెంచారు. ఇక దివ్యాంగుల పింఛన్‌ను రూ.2016కు పెంచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఆసరా పింఛన్‌ను రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చారు.
ఈమేరకు బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కుల వృత్తుల వారికి ఇచ్చే పింఛన్‌ను రూ.1,016 నుంచి రూ.2016కు పెంచా రు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.2016 నుంచి రూ.3,016కు పెంచారు. దీంతో దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా వారి అవసరాలను వారే తీర్చుకుంటున్నారు.
మరో రూ.1000 పెంపు..
ఇటీవల మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సమీకృత భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ది వ్యాంగుల పింఛన్‌ను మరో రూ.1000 పెంచుతున్న ట్లు ప్రకటించారు. జూలై నుంచి పెంచిన పింఛన్ ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో దివ్యాంగులకు జూలై నుంచి పింఛన్ రూ.4,016 అందనుంది. సీఎం ప్రకటినతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 10,740 మందికి లబ్ధి..
నిర్మల్ జిల్లాలోని 10,740 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016 పెంచుతున్నట్లు ప్రకటించడంతో జిల్లాలోని దివ్యాంగులు ఇటీవల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
దివ్యాంగులకు మంచి రోజులు..
ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో దివ్యాంగులకు సరి గా పింఛన్ ఇవ్వలేదు. ఇచ్చిన పింఛన్ కూడా రూ.200 మించలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ మొదట రూ.2,016, తర్వాత రూ.3,016 చేశారు. తాజాగా మరో వెయ్యి కలిపి ఇస్తామని ప్రకటించారు. దీంతో పింఛన్ రూ.4,016 అయింది.
– క్రాంతికుమార్, దివ్యాంగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment