పెంబి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలు, బీమా పథకాలపై ప్రతీ రైతు అవగాహన కలిగి ఉండాలని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాంగోపాల్ అన్నారు. మండల కేంద్రంలోని మ్యాక్స్ సొసైటీలో ఏడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ, బీమా పథకాలపై గురువారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న జన సురక్ష, పీఎం విశ్వకర్మ, ముద్ర, పీఎంఈజీపీ, పీఎం జీవన్ జ్యోతి, అటల్ పెన్షన్‌యోజన, పీఎం ఎఫ్‌ఎంఈ తదితర వ్యవసాయ రుణాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ పథకాలు, రుణాలు పొంది సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. వీటిద్వారా వ్వవసా యం వాటి అనుబంధ రాంగాలైన డెయిరీ, కోళ్లు, చేపలు, తేనెటీగల పెంపకం, కుటీర పరిశ్రమ, కుల వృత్తులలో మరింత అభివృద్ధి సాధించవచ్చని వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ మేనేజర్ నరసింహారెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్, ఏడీసీసీ బ్యాంక్ ఖానా పూర్ శాఖ మేనేజర్ కల్పన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment