
68 మందికి ‘ఉపకారం’
లక్ష్మణచాంద: చదువులో ముందుండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష ఎంతో ఉపయోగకరంగా మారింది. ఏటా జాతీయస్థాయిలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో అర్హత సాధించిన 5 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి.
జిల్లా నుంచి..
నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్‌కు జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు హాజరుకాగా ఇందులో నుంచి 68 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులకు ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందనుంది.
నర్సాపూర్( జి) ఫస్ట్...
నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ అర్హత పరీక్ష పరీక్షలో నర్సాపూర్ (జి)ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తర్వాత బోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 8 మంది అర్హత సాధించి రెండవ స్థానంలో నిలిచారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అర్హత పోటీలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెందిన విద్యార్థులు మొత్తం 68 మంది అర్హత సాధించారు. దీంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్‌ఎంఎంఎస్‌లో మెరిసిన జిల్లా విద్యార్థులు
ఎంపికై న వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున స్కాలర్‌షిప్
పాఠశాలల వారీగా అర్హత సాధించిన
విద్యార్థుల వివరాలు..
పాఠశాల విద్యార్థుల సంఖ్య
నర్సాపూర్(జి) 10
బోసి 08
మస్కాపూర్ 05
ముధోల్ 05
ఆష్టా 05
కుంటాల మోడల్ స్కూల్ 05
లోకేశ్వరం 04
కామోల్ 04
దేహగాం 04
రాజురా 03
ఎడ్‌బిడ్ 03
మహగాం 02
ఓలా(ఉర్దూ) 02
మాలేగావ్ 02
తిమ్మాపూర్ 01
బోరిగాం 01
సోనారి 01
గడ్‌చాంద్ 01
పల్సి 01
లింబా(కే) 01
సంతోషంగా ఉంది
నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్‌నకు అర్హత సాధించడం సంతోషంగా ఉంది. దీంతో ఆర్థికంగా తల్లిదండ్రులపై భారం కొంత తగ్గించడం ఆనందంగా ఉంది.
– కిలారి మధుప్రియ, నర్సాపూర్(జి)

68 మందికి ‘ఉపకారం’
Comments
Please login to add a commentAdd a comment