తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
లక్ష్మణచాంద:లక్ష్మణచాంద తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. వివిధ సర్టిఫికెట్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్న డ్యాష్ బోర్డును పరిశీలించి ఎప్పటికప్పుడు సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాను అరికట్టాలని తెలిపారు. ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తెలుసుకున్నారు. మొత్తం 1,950 దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వచ్చాయని తెలిపారు. ఆన్‌లైన్ చేయడం పూర్తయిందని తహసీల్దార్ జానకి తెలిపా రు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ అజీజ్, ఆర్‌ఐ నరేందర్‌రెడ్డి కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment