జై భవాని.. జై శివాజీ..
నిర్మల్‌చైన్‌గేట్: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణం బుధవారం ‘జైభవానీ.. జై శివాజీ.. ఛత్రపతి శివాజీ మహరాజ్‌కీ జై..’ నినాదాలతో మార్మోగింది. శివాజీ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి శివాజీచౌక్ వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశం కోసం.. ధర్మం కోసం చివరి ఊపిరి వరకు పోరాడిన శివాజీ గొప్పతనం ముందుతరాలకూ తెలియజేయాలన్నారు. ముఖ్యవక్త గోసేవా ప్రాంతప్రముఖ్ వెంకటనివాస్ మాట్లాడుతూ హిందువులు సంఘటితంగా ఉంటేనే శివాజీ మహారాజ్ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. శివాజీ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మెడిసెమ్మె రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నిర్వహించారు.
ర్యాలీ అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నాయులు, కార్యకర్తలు
మాట్లాడుతున్న మహేశ్వర్‌రెడ్డి
జై భవాని.. జై శివాజీ..
Comments
Please login to add a commentAdd a comment