సమీకృత గురుకులం నిర్మాణ స్థలం పరిశీలన
దిలావర్‌పూర్: మండలంలోని సిర్గాపూర్ గ్రా మంలోని సర్వే నంబర్ 664లోని భూమిని రాష్ట్ర కమిషనర్ కృష్ణ ఆదిత్య, కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల సమీకృత నిర్మాణం కోసం గ్రామంలో స్థలం ఎంపిక చేశారు. భవన నిర్మాణం పగడ్భందీగా చేపట్టాలంటూ కమిషనర్ కృష్ణ ఆది త్య సూచించారు. ఇందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపా రు. వారివెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ అశోక్‌కుమార్, డీఐఈవో పరశురాం, డీఈ గంగాధర్, తహసీల్దార్ స్వాతి, ఏఈ తుకారాం, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment