బ్యాంకులు మెరుగైన సేవలు అందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రజలకు బ్యాంకులో అందజేసిన రుణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు అందించే రుణాల మంజూరులో జాప్యం చేయొద్దని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశం అనంతరం అదనపు కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా పొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్ 2025–26 సంచికను ఆవిష్కరించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌గోపాల్, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, డీఆర్డీవో విజయలక్ష్మి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామారావు, ఆర్‌బీఐ ఎల్బీఓ దేవ్‌జిత్ బారువ, జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment