ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీసీహెచ్‌ఎస్ సురేశ్
భైంసాటౌన్: ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలందించాలని డీసీహెచ్‌ఎస్ సురేశ్ అన్నారు. డీఎంహెచ్‌వో రాజేందర్‌తో కలిసి పట్ట ణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని బుధవారం తని ఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని 5–12 తరగతుల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారికి ఆప్తాల్మజిస్ట్ ఆధ్వర్యంలో ఏరియాస్పత్రిలో మరోమారు పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ అధికారుల ఆదేశాల మేరకు ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో దాదాపు 1,385 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని, వీరిలో అవసరమైనవారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, వైద్యులతో సమావేశం నిర్వహించారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆర్థో, జనరల్ సంబంధ ఆపరేషన్ల సంఖ్య పెంచాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. త్వరలోనే ఆస్పత్రిలో వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవినాష్, ఏరియాస్పత్రి వైద్యుడు అనిల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment