వేసవిలో తాగునీటి సమస్య తలెత్తొద్దు
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
నిర్మల్‌చైన్‌గేట్:వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, విద్యుత్ వినియోగం, రైతుభరోసా, ఆహారభద్రత కార్డుల పరిశీలన, రబీ పంటలకుసాగు నీరు తదితర అంశాలపై చర్చించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలందరికీ నిరంతరం నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రబీ పంటలకు సాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని తెలిపారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాగు, తాగునటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయానికి విద్యుత్ కొరత రాకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలను సీఎస్‌కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ రవీందర్, డీపీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ సందీప్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, జాదవ్‌కృష్ణ, డీఎస్‌వో కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment