యూరియా కోసం ఆందోళన
ఖానాపూర్: పట్టణంలోని గ్రోమోర్ ఫర్టిలైజర్స్ వద్ద ఖానాపూర్, కడెం, పెంబి మండలాల రైతులు మంగళవారం ఆందోళన చేశారు. యూరియా కోసం వచ్చిన రైతులకు నిర్వాహకులు గంట గులికలు, ఇతర మందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని బలవంతంగా కొనిపిస్తున్నారు. దీంతో రైతులు నిర్వాహకులను నిలదీశారు. అనంతరం స్థానిక వ్యవసాయ అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి జగదీశ్వర్‌ను వివరణ కోరగా.. రైతులు చెప్పిన వెంటనే ఎటువంటి ఇతర మందులు కొనుగోలు చేయకుండానే యూరియా ఇవ్వాలి నిర్వాహకులను ఆదేశించామన్నారు. ఈ విషయమై విచారణ చేసి తగు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతులు కల్‌మర్ రాజేశ్వర్, రాచర్ల శేఖర్, జోగు రాజేశ్వర్, బూక్య గోవింద్‌నాయక్, కుందూరి గంగాధర్, గాడ్పు రాజేందర్, కట్ల మహేశ్, కోమటిపెల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment