ప్రయాణికులను గౌరవించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులను గౌరవించాలి

Published Wed, Feb 19 2025 1:44 AM | Last Updated on Wed, Feb 19 2025 1:39 AM

ప్రయాణికులను గౌరవించాలి

ప్రయాణికులను గౌరవించాలి

నిర్మల్‌టౌన్‌: ప్రతీ ఆర్టీసీ ఉద్యోగి ప్రయాణికులను గౌరవించాలని ఆదిలాబాద్‌ రీజియన్‌ డిప్యూటీ ఆర్‌ఎం ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రొజెక్టర్‌ ద్వారా ఉద్యోగులకు డ్యూటీలో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలపై మంగళవారం తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు ఈ సంస్థ నాది అని పనిచేయాలని, అప్పుడే మనం తృప్తి చెందుతామని సూచించారు. ఈ క్లాసులు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. డిపోలోని ప్రతీ ఉద్యోగి ఈ క్లాసులకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ప్రతిమారెడ్డి, అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజశేఖర్‌, ఏఈ నవీన్‌కుమార్‌, ఉద్యోగులు పాల్గొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement