కష్టపడి చదివితేనే భవిష్యత్తు
● డీఈవో రామారావు
సారంగపూర్: విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని డీఈవో రామారావు అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా పదో తరగతికి సమాయత్తమవుతున్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సిలబస్, రివిజన్ తరగతులు, ప్రత్యేక తరగతుల నిర్వాహణ తదితర విషయాలను తెలుసుకున్నారు. ప్రత్యేక తరగతులకు ఏఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కావొద్దని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు సైతం కష్టపడి చదివి మంచి జీపీఏ సాధించాలన్నారు. సీ గ్రేడ్ విద్యార్థులను ఏగ్రేడ్‌లోకి తీసుకురావడానికి ఉపాధ్యాయులు సైతం అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఇక భోజనం విషయంలో రాజీపడొద్దన్నారు. ప్రతీరోజు ఒక ఉపాధ్యాయుడు భోజనం వండే సమయంలో అందుబాటులో ఉండి మెనూ ప్రకారం రుచికరంగా అందేలా చూడాలని సూచించారు. అనంతరం ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఆయన వెంట ఎంఈవో మధుసూదన్, హెచ్‌ఎం విజయ, ఉపాద్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment