పాడుబడిన ఇంట్లో మంటలు | - | Sakshi
Sakshi News home page

పాడుబడిన ఇంట్లో మంటలు

Published Sat, Feb 15 2025 12:14 AM | Last Updated on Sat, Feb 15 2025 12:14 AM

పాడుబడిన ఇంట్లో మంటలు

పాడుబడిన ఇంట్లో మంటలు

నిర్మల్‌: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న ఓ పాడుబడిన ఇంట్లో శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇల్లు రోడ్డుపక్కనే ఉండటం, సమాచారం వెంటనే అందడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపు చేశారు. ప్రమాదం జరిగిన ఇంటికి సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి, బ్యాంకు, ఓ హోటల్‌ ఉండటంతో స్థానికులు కంగారు పడ్డారు. ఇంట్లో చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. ఫైర్‌ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనాస్థలాన్ని ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement