
భరోసా @ 39.20%
● రెండెకరాల రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం ● 75,101 ఖాతాల్లో రూ.51.07 కోట్లు ● వారానికి ఎకరం పెంచుతూ నిధులు విడుదల
ఫిబ్రవరి 12 నాటికి రైతు భరోసా
అందిన రైతుల వివరాలు
రైతుల సంఖ్య 75,101
ఇప్పటివరకు జమ అయిన సొమ్ము 51,07,39,232
మండలం రైతులు జమైన డబ్బు
భైంసా 5,341 3,95,67,076
కుభీర్ 5,552 4,45,02,278
కుంటాల 2,841 2,11,78,997
దస్తురాబాద్ 3,106 2,46,19,542
కడెం పెద్దుర్ 5,330 3,39,65,188
ఖానాపూర్ 4,855 2,95,21,348
పెంబి 1,963 2,00,29,710
బాసర 2,366 1,82,36,356
లోకేశ్వరం 5,276 3,56,25,347
ముధోల్ 4,245 2,93,20,472
తానూర్ 5,013 3,86,30,599
దిలావర్‌పూర్ 3,130 1,86,13,469
నర్సాపూర్(జి) 3,190 2,18,10,514
సారంగాపూర్ 5,536 3,14,71,027
సోన్ 3,631 2,06,41,402
లక్ష్మణచాంద 4,890 2,94,68,336
మామడ 3,874 2,42,36,728
నిర్మల్ రూరల్ 4,590 2,81,00,213
నిర్మల్ అర్బన్ 372 12,00,630
నిర్మల్‌చైన్‌గేట్: రైతుల ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. ప్రజాప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది తర్వాత జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుభరోసా పథకం ప్రారంభించారు. తొలుత మండలానికి ఓ రెవెన్యూ గ్రామం ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు కింద 27న జిల్లా వ్యాప్తంగా 18 గ్రామాల రైతుల ఖాతాల్లో నగదు జమచేశారు. పైలట్ ప్రాజెక్టులో జిల్లా వ్యాప్తంగా 6,710 మంది రైతుల ఖాతాల్లో రూ.11.18 కోట్లు నగదు జమచేశారు. వారం గ్యాప్‌తో ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేయగా.. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో రెండెకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు సైతం రైతు భరోసా డబ్బులు విడుదల చేశారు.
39.20 శాతం పూర్తి
రైతు ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు జమ చేస్తుండగా వారి సంఖ్యను బట్టి ఇప్పటి వరకు 39.20 శాతం పథకం పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 1,91,570 మంది ఉండగా వీరికి 4,41,758 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఒక ఎకరం వరకు భూమి కలిగిన రైతులు 70,219 మంది లుండగా.. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద జనవరి 27వ తేదీన 6,710 రైతులకు, రూ.10.56 కోట్లు జమ చేసింది. తాజాగా సోమవారం రెండెకరాల వరకు భూమి ఉన్న 68,391 మంది రైతులకు 41.07 కోట్లు జమచేశారు.
మరో రెండు నెలలు..?
పథకం ప్రారంభించిన తర్వాత ఒక్కో ఎకరా చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. ఎకరా, రెండు ఎకరాలకు నడుమ వారం రోజుల సమయం తీసుకుంటున్నారు. ఈ లెక్కన పది ఎకరాలు ఉన్న రైతులకు సాగు సాయం అందాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందేమోనని రైతులు చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే వర్షాకాలం విత్తనాలు ప్రారంభించేనాటికి మొదటివిడత రైతు భరోసా పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఎకరం ఉన్నా రాలేదు..
నాకు ఒక ఎకరం భూమి ఉంది. అందులో పత్తి సాగు చేశాను. మూడు ఎకరాల దాక రైతు భరోసా వేశామంటున్నారు. మరీ నాకు ఎకరం భూమి ఉండే ఇప్పటి వరకు భరోసా డబ్బులు ఎందుకు జమకాలేదో తెలుస్తలేదు.
– ఉట్ల కోటయ్య, చిన్న బేలాల్
వచ్చే సీజన్‌పై సందేహాలు..
రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటింది. గత యాసంగిలో మాత్రమే రైతుభరోసా నిధులు జమ చేశారు. గత ప్రభుత్వం సాగుకు యోగ్యంకాని భూములకూ రైతుబంధు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేసిందని, తాము అర్హులకే ఇస్తామని ప్రస్తుతం ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం కమిటీ నివేదిక, మార్గదర్శకాల రూపకల్పన పేరిట కాలయాపన చేసి గత ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేదు. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన సాయాన్ని విడతలవారీగా జమచేస్తున్నారు. అయితే నిధుల కొరత ఎదుర్కొంటున్న సర్కారు.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో రైతుభరోసా ఇస్తుందా లేక గత ఖరీఫ్ తరహాలోనే చేస్తుందా అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

భరోసా @ 39.20%
Comments
Please login to add a commentAdd a comment