మాస్‌కాపీయింగ్ జరిగినట్లు కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్య
ఖానాపూర్: ఇటీవల భైంసాలో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జరిగినట్లు మస్కాపూర్ గ్రామస్తులు, విద్యార్థులు సోమవారం కలెక్టర్ అభిలాష అభినవ్‌కు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్ష నిర్వహించగా భైంసా పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 61 మంది విద్యార్థులకే మెరిట్ వచ్చినట్లు ఆరోపించారు. మాస్‌కాపీయింగ్ జరిగినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి పరీక్షలు మళ్లీ నిర్వహించాలని మస్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ తరపున కలెక్టర్‌ను కోరారు.
రికార్డు నాట్యంలో చిన్నారులు
భైంసాటౌన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూ ర్తి కేంద్రంలో ఆదివారం రాత్రి సమతాకుంభ్–2025 పేరిట తృతీయ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 3వేల మంది చిన్నారులతో నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు నమోదు చేశారు. రికార్డు స్థాయి నాట్య ప్రదర్శనలో భైంసా నుంచి శ్రీనయనం నృత్య కళానిలయానికి చెందిన 21 మంది చిన్నారులు పాల్గొన్నారు. వీరు నిర్వాహకుల నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు కళానిలయం శిక్షకురాలు రంగు సౌమ్య తెలిపా రు. వీరిని పలువురు అభినందించారు.
మాస్‌కాపీయింగ్ జరిగినట్లు కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్య
Comments
Please login to add a commentAdd a comment