విద్యార్థులకు కంటి పరీక్షలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్‌వో ధనరాజ్ మాట్లాడుతూ.. గతంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించి 1,385 మందికి కంటి లోపాలున్నట్టు గుర్తించినట్లు తెలిపారు. వారికి ఇప్పుడు నేత్ర వైద్యాధికారి ద్వారా కన్ఫర్మేషన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్, వైద్య విధాన పరిషత్ డీసీహెచ్‌ఎస్ సురేశ్, నేత్ర వైద్య నిపుణుడు ఇద్రిస్, పీవోసీహెచ్‌ఐ నయనారెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment