ఇసుక తరలిస్తే చర్యలు
నిర్మల్‌టౌన్: ఇసుకను అక్రమంగా రవాణా చే స్తే చర్యలు తప్పవని ఎస్పీ జానకీ షర్మిల హె చ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాజులపేట్, రాంనగర్, మంజులాపూర్ ప్రాంతాల్లో అక్రమ ఇసుక నిల్వలు, వే బిల్లులు పరి శీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందు కు ప్రత్యేక పోలీస్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంల ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 17 ఇసుక రీచ్‌లు, 35 ఇసుక నిల్వలున్నట్లు పే ర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికా రుల సహకారంతో అక్రమ ఇసుక నిల్వలను సీ జ్ చేస్తామని పేర్కొన్నారు. భైంసా ఏఎస్పీ అవినాష్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment