
నిర్మల్
సల్లంగ చూడు.. మల్లన్న
గురువారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ఆలయంలో కొలువైన మల్లన్న దేవుడు
బోనాలతో ఊరేగింపుగా మల్లన్న ఆలయానికి వస్తున్న భక్తులు
ఆలయం వెలుపల భక్తులు వెలిగించిన దీపాలు
సమస్యలు విని.. పరిష్కారానికి ఆదేశించి..
● భైంసా ‘ప్రజావాణి’లో ఎస్పీ జానకీషర్మిల
భైంసాటౌన్: పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల బుధవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పలువురు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు సావధానంగా విని చట్టరీత్యా పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బుధవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు నిర్భయంగా, నేరుగా తనను కలిసి సమస్యలు విన్నవించవచ్చని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సై అశోక్ ఉన్నారు.
నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలో బుధవారం మల్లన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు ఈ జాతర కొనసాగనుంది. సాయంత్రం వివిధ గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో చల్ల కుండలతో పాదయాత్రగా వచ్చి స్వామివారికి పూజలు చేశారు. చల్ల నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్, భైంసా, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొందరు భక్తులు తులాభారం వేశారు. తలనీలాలు సమర్పించారు. డీసీసీ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం రథయాత్ర నిర్వహిస్తారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా నిర్మల్ రూరల్, దిలావర్‌పూర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. – నిర్మల్ రూరల్
న్యూస్‌రీల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment