
ఆర్జీయూకేటీలో చర్చాగోష్టి
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో ఇన్ఫ్యూజన్ టాక్స్ 2, మై విలేజ్ షో బృందం చర్చాగోష్టి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ డిజిటల్ సృష్టికర్తలు, వ్యవస్థాపకులను ఒకచోట చేర్చిన ప్రేరణాత్మక కార్యక్రమని ఓఎస్డీ ప్రొఫెసర్ మురళిదర్శన్ అన్నా రు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ ఆదేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. 2 వేల మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ, మైవిలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీకాంత్, కీలక సభ్యుడు చందు, ఇన్‌స్ట్రాగా మ్ ఇన్‌ఫ్లూయెన్సర్ స్టీఫెన్ భాను హాజరయ్యారు. సెషన్‌లో స్పీకర్లు తమ స్ఫూర్తిదాయకమైన కథలు, సవాళ్లు కంటెంట్ సృష్టి, వ్యవస్థాపకత, డిజిటల్ వృద్ధిపై విలువైన విషయాలను పంచుకున్నారు. ప్రశ్నోత్తరాల సెషన్ విద్యార్థులు అతిథులతో నేరుగా సంభాషించడానికి వీలు కల్పించి ఈవెంట్‌ను ఆకర్షణీయంగా మార్చారు.విద్యార్థులు కథ చెప్పడానికి ఉత్సాహం కనబర్చారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్‌సాగి, డాక్టర్ రాకేశ్‌రెడ్డి, ఐఐఈడీ కోఆర్డినేటర్, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న గంగవ్వ

ఆర్జీయూకేటీలో చర్చాగోష్టి
Comments
Please login to add a commentAdd a comment