
కిక్ బాక్సింగ్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
నిర్మల్‌టౌన్: ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన అక్షయ, నాగలక్ష్మి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. వరుసగా వెండి, కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్ర జట్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో బుధవారం అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్ సెక్రెటరీ మహిపాల్, శిక్షకులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో..
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 8 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పట్టణంలోని రవి ఉన్నత పాఠశాల విద్యార్థి అనుముల శ్రీవైష్ణవి అండర్–13 బాలికల విభాగం సింగిల్స్, డబుల్స్‌లో ప్రతిభ కనబర్చింది. ప్రథమ స్థానంలో నిలిచింది. శ్రీవైష్ణవిని పాఠశాల ప్రిన్సిపాల్ రాణి, కరస్పాండెంట్ వెంకటేశ్వర్‌రావు అభినందించారు.

కిక్ బాక్సింగ్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment