పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
సారంగపూర్: ప్రతీ గ్రామం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ గ్రామంలోనూ ప్రజలు స్వచ్ఛందంగా తమ గ్రామం బాగుకోసం, స్వచ్ఛదనం కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులంలో పంచాయతీ కార్మికులతోపాటు మండల అధికారులు, పాఠశాల సిబ్బందితో కలిసి పరిసరాలు శుభ్రం చేశామని అన్నారు. వారానికి రెండురోజులు కేటాయిస్తే పరిసరాలన్ని పరిశుభ్రంగా ఉండి ప్రజలు పూర్తి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఎంపీడీవో లక్ష్మీకాంతరా వు, ఎంపీవో అజీజ్‌ఖాన్, ఏపీవో లక్ష్మారెడ్డి, పంచా యతీ కార్యదర్శి నరేశ్‌కుమార్, ప్రిన్సిపాల్ సంగీత, సిబ్బంది గోవర్ధన్, టీచింగ్ సిబ్బంది, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment