
1104 యూనియన్ ఆవిర్భావ వేడుకలు
నిర్మల్‌చైన్‌గేట్: విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 ఆవిర్భావ వేడుకలను విద్యుత్ శాఖ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కల పోచయ్య యూనియన్ జెండా ఎగురవేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ 75 ఏళ్లుగా యూనియన్ కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తోందన్నారు. కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ 1104 యూనియన్ పోరాడి సాధించినవే అని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొడాలి వెంకటరమణ, కార్యదర్శి టి.మనోహర్‌స్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోరిపెల్లి శ్రీనివాస్, జిల్లా సలహాదారు రేగుంట రాజేశ్వర్, డిస్కమ్ నాయకులు డి.రాజేశ్వర్‌రావు, ఎస్‌ఏ.రెహమాన్, రమాకాంత్, రఘు, మోహన్, నారాయణ్‌సింగ్, గోపి, అశోక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment