సమస్యల పరిష్కారానికి కృషి
నిర్మల్‌టౌన్: కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ సాంస్కృతిక కళాసంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు పాట రాజశ్రీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలిపారు. కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. కళాకారుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. త్వరలో జిల్లా కమిటీలను నియమిస్తామని చెప్పారు. ఆ మె వెంట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాట మహేశ్, జిల్లా అధ్యక్షుడు అష్టదిగంబర్, కళాకారులు పసుల రవి, మాడ సతీశ్, సాంస్కృతిక కళాసంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment