సరస్వతీ అమ్మవారికి రూ.కోటికి పైగా ఆదాయం
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి హుండీని దేవస్థానం అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. 79 రోజుల హుండీ ఆదాయం రూ.1,08,25,110, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4కిలోల 800 గ్రాములు, విదేశీ కరెన్సీ 36 నోట్లు వచ్చాయని ఆలయ ఈవో కే సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆలయ ఏఈవో సుదర్శన్‌గౌడ్, దేవస్థాన వైదిక పరిపాలన సిబ్బంది, యూబీఐ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, దేవస్థాన హోంగార్డ్స్, వాగ్దేవి సొసైటీ సభ్యులు, శివరామకృష్ణ సేవాసమితి రాజన్న సిరిసిల్ల భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment