ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
● నేర సమీక్షలో ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవా ణాను అరికట్టాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించా రు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి వీలైనంత త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్లవారీగా పెండింగ్ కేసుల వివరాలు, కారణాలు తెలుసుకుని, త్వరగా పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్ల పరిధిలో గ్రామ, నగరంలో వార్డుల సందర్శనలు పెరగాలని పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలని తెలిపారు. రౌడీ షీటర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ట్రయల్స్‌కు వచ్చినప్పుడు కేసు తీవ్రతను బట్టి అవసరమైతే సబ్ డివిజన్ అధికారులూ కోర్టుకు వెళ్లి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలని తెలిపా రు. గంజాయిని అరికట్టాలని పేర్కొన్నారు. అనంత రం మరిన్ని మెరుగైన సేవలందించడానికి నూతన కంప్యూటర్లు, వెబ్ కెమెరాలను ఎస్సైలకు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్, నైలు, గోపీనాథ్, ప్రేమ్‌కుమార్, మల్లేశ్, ఎస్సైలు, జిల్లా ముఖ్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment