‘గ్యారంటీల అమలులో విఫలం’
భైంసాటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ముధోల్ ఎమ్మెల్యే రా మారావు పటేల్ ఆరోపించారు. గురువారం భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్‌లో ఆయన పట్టణ, మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జీలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ స్థానాల పట్టభద్రులు, టీచ ర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల విజయోత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి (పట్టభద్రులు), మల్కా కొమురయ్య (టీచర్స్) విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జీలు హరినాయక్, శివ చంద్రగిరి, బీజేపీ పటణాధ్యక్షుడు మల్లేశ్వర్, మండలాధ్యక్షురాలు సుష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment