● డీఆర్డీవో విజయలక్ష్మి
కుంటాల: ఉపాధి హామీపథకంలో ప్రతీ కూలీకి పని కల్పిస్తామని డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపా రు. మండలంలోని దౌనెల్లి గ్రామాన్ని శుక్రవా రం సందర్శించారు. రాబోయే వేసవిలో నర్సరీ ల్లో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధిహామీ, ఐకేపీ సిబ్బందితో సమీ క్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వందరోజుల పని కల్పించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఏపీవో గట్టుపల్లి నవీన్, ఏపీఎం అశోక్, సీసీ, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment