నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Sat, Feb 15 2025 12:14 AM | Last Updated on Sat, Feb 15 2025 12:13 AM

నిర్మ

నిర్మల్‌

పరిస్థితులు కథలై..
ఉద్యోగ రీత్యా ఎదురైన పరిస్థితులు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు కథలుగా మార్చాడు జన్నారం మండల వాసి వాసు. పుస్తక రూపం ఇచ్చాడు.

8లోu

శనివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

డిప్యూటీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే

భైంసాటౌన్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.నారాయణ్‌రావు పటేల్‌ శుక్రవారం కలిశారు. కుల గణన, వర్గీకరణపై గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమం ఉండగా, ముధోల్‌ నుంచి ఆయన హాజరయ్యారు. కార్యక్రమ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ముధోల్‌ నియోజకవర్గం సమస్యలు వివరించినట్లు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలను కలిసినట్లు వెల్లడించారు.

నిర్మల్‌: జిల్లాలో మిల్లర్ల మాయాజాలం ఆగడం లేదు. పేదలకు అందించే రేషన్‌ బియ్యం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నాయి. రేషన్‌ దుకాణాలు, లబ్ధిదారుల నుచి పీడీఎస్‌ బియ్యం సేకరించి.. అదే బియ్యాన్ని సీఎంఆర్‌గా అప్పగస్తున్నారు. సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. పేదలకు అందించే బియ్యాన్ని తక్కువ ధరకు కొని, మళ్లీ ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్మే రైస్‌ రీసైక్లింగ్‌ దందా జోరుగా సాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు, సిబ్బంది తీరుపైనా విమర్శలు ఉన్నాయి.

కేసులు అవుతున్నా..

జిల్లాలో కేవలం ఐదారు నెలల్లోనే రైస్‌ మిల్లులపై దాదాపు 15 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడెనిమిది క్రిమినల్‌ కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్‌ వరకూ వెళ్లాయి. అయినా.. జిల్లాలో రేషన్‌ రీసైక్లింగ్‌ దందా ఆగడం లేదు. జిల్లాలో 2022–23కు సంబంధించిన సీఎంఆర్‌ గడువు ముగిసినా సకాలంలో ఇవ్వనివి 32 డిఫాల్ట్‌ మిల్లులు గుర్తించగా, అందులో 23 మిల్లుల నుంచి బియ్యం రికవరీ చేశారు. మిగిలిన 9 మిల్లులు ఇప్పటికీ సీఎంఆర్‌ క్లియర్‌ చేయలేదు. వీటిపైనే కేసులు నమోదయ్యాయి. ఇందులో కొన్నింటికి రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం ఆస్తుల వేలం నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

తనిఖీలపై అనుమానాలు..

రేషన్‌ బియ్యం రాష్ట్రాలు దాటుతున్నా.. అదే బియ్యం సన్నగా మారి జిల్లాలోకి వస్తున్నా.. ఎప్పుడో ఒకసారి మాత్రమే పట్టుబడుతున్నాయి. ఈనెల 7న భైంసాలో రోడ్డుప్రమాదం జరగడం వల్లే సదరు లారీలో 362 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌ పట్టుబడింది. ఈ యాక్సిడెంట్‌ జరగకపోయి ఉంటే.. ఆ బియ్యం ఏదో ఒక రైస్‌ మిల్లుకు చేరేది. ఇదే ఘటనలో అనుమానంతో లక్ష్మణచాందలో రైస్‌ మిల్లులను తనిఖీ చేస్తే.. అక్కడ ఉండాల్సిన ధాన్యం లేకపోవడం జిల్లాలో రీసైక్లింగ్‌ దందా జోరుగా సాగుతోందన్న వాదనను బలపరుస్తోంది. మరోవైపు జిల్లా అధికారులు తాము ఇలాంటి వాటిపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికే కేసులనూ నమోదు చేశామని, రికవరీ చేయనివారిపై క్రిమినల్‌కేసులు, ఆర్‌ఆర్‌యాక్ట్‌లనూ పెట్టేందుకూ సిద్ధమవుతున్నామని పేర్కొంటున్నారు.

చర్యలు తీసుకుంటాం..

జిల్లాలో గడువు దాటినా సీఎంఆర్‌ లెక్కతేల్చని రైస్‌ మిల్లులపై ఇప్పటికే కేసులు నమోదు చేశాం. పలు మిల్లుల నుంచి రికవరీ చేపడుతున్నాం. 2023–24 ఖరీఫ్‌కు సంబంధించి 89 వేల మెట్రిక్‌ టన్నులు రికవరీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం.

– కిరణ్‌, డీఎస్‌వో

పరీక్షిస్తే.. తెలిసిపోతుంది..!

ఎప్పుడూ అంతే..

న్యూస్‌రీల్‌

పేదల బియ్యం.. పెద్దలకు ఆదాయం

వరుసగా కేసులవుతున్నా.. మిల్లుల్లో ఆగని మోసాలు

ఐదు నెలల్లో 15 కేసులు నమోదు

మర ఆడించిన తర్వాత పౌరసరఫరాల కోసం మిల్లులు ఇచ్చే బియ్యాన్ని పరీక్ష చేసి తీసుకోవాలి. దీనిని ఎంఐటీ(మిక్స్‌డ్‌ ఇండికేటర్‌ టెస్ట్‌) అంటారు. ఈ పరీక్షలో పాత బియ్యమైతే ఎల్లో కలర్‌లో, తాజాగా మర ఆడించిన బియ్యమైతే అవకాడో గ్రీన్‌ కలర్‌లోకి మారుతాయి. ఇలాంటి పరీక్షలు చేసిన తర్వాతనే తాజాగా మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాలకు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రోకెన్‌రైస్‌, తౌడుశాతం తదితర అంశాలు పరిశీలించాలి. ఈ పరీక్షలు చేస్తే ఆ ధాన్యం మిల్లింగ్‌ చేసిందా..! లేక రేషన్‌ బియ్యం సేకరించి సీఎంఆర్‌ పెట్టారా..! అనేది స్పష్టమవుతుంది. జిల్లాలో రీసైక్లింగ్‌ దందాను చూస్తుంటే.. ఈ పరీక్షలపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. నాణ్యమైన బియ్యాన్ని పక్కదారి పట్టించి, పాత రేషన్‌ బియ్యాన్నే అటూఇటు రీసైకిల్‌ చేస్తున్నారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం రూపంలో ఇవ్వడానికి ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు అప్పగిస్తుంది. ఇందుకోసం వారికి ఇచ్చిన గడువులోపల ఇవ్వాలి. అలాగే కేటాయించిన ధాన్యంలో రారైస్‌ అయితే 67 శాతం, బాయిల్డ్‌ అయితే 68 శాతం బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. మిగితా కమీషన్‌ రూపంలో మిల్లర్లు తీసుకుంటారు. ప్రస్తుతం జిల్లాలో 2023–24 రబీకి సంబంధించి సీఎంఆర్‌ కొనసాగుతోంది. రైస్‌ మిల్లులకు 1.56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంఅందించారు. మొత్తం 1.05 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లులు అందించాలి. ఇప్పటి వరకు 31,500 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇక సీఎంఆర్‌లో చాలామంది మిల్లర్లు ఏళ్లుగా చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. గడువును పట్టించుకోవడం లేదు. ఇచ్చిన ధాన్యాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ.. రేషన్‌బియ్యాన్ని తక్కువధరకు కొనుగోలు చేస్తున్నారు. తిరిగి ఇదే బియ్యాన్ని సీఎంఆర్‌ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. తాజాగా భైంసాలో పట్టుబడ్డది కూడా సీఎంఆర్‌ కింద చూపేందుకు మిల్లులకు తరలుతున్న పీడీఎస్‌ బియ్యమే.

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement