
నిర్మల్
ఆదర్శప్రాయుడు సేవాలాల్
సంత్ సేవాలాల్ మహరాజ్ ఆదర్శ ప్రాయుడని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నా రు. బాసరలోని గోదావరి నది ఒడ్డున సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
8లోu
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
గజ్జలమ్మ దేవికి పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, ఇస్లాంపూర్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చారు. చిన్నారులతో బంగారం తు లాభారం వేయించారు. తలనీలాలు సమర్పించారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి మొ క్కు తీర్చుకున్నారు. మండలంలోని ఓలా గ్రా మానికి చెందిన సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కర్ల బక్కయ్య–అర్చన దంపతులు అమ్మవార్ల కు మూడున్నర మాసాల బంగారపు ముక్కుపుడక, బొట్టుబిళ్ల సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. వీరిని ఆలయ సమితి సభ్యులు సన్మానించారు. ఆలయ సమితి సభ్యుడు మేసినేని వెంకట్‌రావు, అర్చకుడు నగేశ్, జుట్టు అభిషేక్, సుధీర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: ‘తన ఫ్రెండ్స్‌తో పాటు సార్లందరూ బాగానే ఉన్నారు. కానీ..ఆ ఒక్క సార్ మాత్రమే మరోలా ఉ న్నాడు. అందరి దృష్టిలో మంచోడనే పేరుంది. తనతో ఆ సార్ మాట్లాడే మాటతీరు, అతడి ప్రవర్తన ఏమాత్రం బాగాలేదు. వ్యంగ్యంగా, కాస్త అసభ్యకరమైన రీతిలో మాట్లాడటం చేస్తున్నాడు. ఆమెలో తెలియని భయం. ఇదంతా ఇంట్లో వాళ్లకో.. స్నేహితులకో.. చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఎక్కడ తనది.. తన కుటుంబానిది పరువు పోతుందోనన్న భయం. మరోవైపు ఎదిరించినా.. లేదా ఇలాగే మౌనంగా ఉన్నా ఇంకేం చేస్తాడోనన్న భయాందోళన.. వీటిమధ్య తనలో తానే కుమిలిపోతోంది.’
ఇలా.. ఒక్క ఈ విద్యార్థినికే కాదు.. రో జూ ఆటోలో ఉద్యోగానికి వెళ్తున్న ఓ ఉద్యోగిని ఆ ఆటోడ్రైవర్ వేధింపులను తట్టుకోలేక ఇబ్బంది పడుతోంది. ఓ పెద్ద దుకాణంలో పనిచేస్తున్న మరో యు వతి సదరు యజమాని నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వేధింపులకు గురవుతున్న ఉద్యోగినులూ ఉన్నారు. అడుగడుగునా అతివలకు అసభ్యకరమైన వేధింపులు, వ్యంగ్యమైన మాటలు, మింగేలా చూసే చూపులు తప్పడం లేదు. కానీ.. వారంతా తమలో తామే కుమిలి పోతున్నారు. ఇలాంటి వారి నుంచి కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి జిల్లాలో ‘ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ’ (ఐసీసీ)లను ఏర్పాటు చేయలేదు. మహిళలు పనిచేసేచోట ఉండాల్సిన ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ల జాడ లేదు. జిల్లాలో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నా.. అధికారుల పట్టింపు లేదన్న ఆరోపణలున్నాయి.
వేధించని చోటెక్కడా..?
అక్కడా, ఇక్కడా అని కాదు.. మహిళలపై ప్రతిచో టా లైంగిక వేధింపులు పెరుగుతుండటం ఆందోళనకరం. ప్రధానంగా జిల్లాలో ఇటీవలి కాలంలో ఇలాంటి వేధింపులు వేగంగా పెరుగుతున్నాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో వివిధ దుకాణాలు, హోటళ్లు, ప్రైవేట్ కార్యాలయాల్లో యువతులు, మహిళలు పనిచేస్తున్నారు. ఇలాంటి చోట్ల చాలామంది వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు ఆశ చూపుతూ లొంగదీసుకుంటున్న ఘటనలూ ఉన్నాయి. బయటకు వచ్చి చెప్పుకొంటే.. పరువుతో పాటు ఉన్న ఉపాధి పోతుందన్న భయం బాధితుల నోరు తెరువనివ్వడం లేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు, కెరిర్ గైడెన్స్ ఇవ్వాల్సిన అధ్యాపకులూ తమ స్టూడెంట్లపై కన్నేయడం, వేధించడం దారుణం.
తానే ట్రాన్స్‌ఫర్ చేయించుకుని..
ఓ శాఖకు చెందిన ఉద్యోగిని ఓ అధికారి నుంచి వేధింపులను ఎదుర్కొన్నారు. సంబంధిత శాఖ పనిపైన కాకుండా పర్సనల్ విషయాలను మాట్లాడటం, చొరవ తీసుకోవడం చేశాడు. అవసరం లేకున్నా ఫోన్లు, మెసేజ్‌లు చేయడం కొనసాగించాడు. ఎంత చెప్పినా సదరు సారులో మార్పు రాకపోవడంతో బాధిత ఉద్యోగినే ట్రాన్స్‌ఫర్ చేసుకుని వెళ్లిపోయారు. గతంలోనూ ఓ స్థాయి అధికారి ఇదే తీరుగా తన కింది ఉద్యోగినితో ప్రవర్తించిన తీరు విచారణ వరకూ వెళ్లింది.
న్యూస్‌రీల్
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
నిర్మల్ రూరల్: మెదక్ జిల్లా చేగుంటలో సీఆ
ర్పీలుగా పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమేశ్, శ్రీనివాస్ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాదిగ అంబేడ్కర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బర్ల సాయినాథ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొ ప్పున ఎక్స్‌్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవా లని కోరారు. సీఆర్పీలు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమండ్ చేశారు.
మహిళలపై తరచూ వేధింపులు
యువతులు, ఉద్యోగినులపైనా..
కుమిలిపోతున్న బాధిత సీ్త్రలు
కనిపించని ఫిర్యాదు కమిటీలు
సంబంధిత అధికారుల పట్టింపేది?

నిర్మల్

నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment