తెరపాఠం.. పరిపుష్టం | - | Sakshi
Sakshi News home page

తెరపాఠం.. పరిపుష్టం

Published Mon, Feb 17 2025 12:09 AM | Last Updated on Mon, Feb 17 2025 12:08 AM

తెరపాఠం.. పరిపుష్టం

తెరపాఠం.. పరిపుష్టం

నిర్మల్‌ఖిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ పాఠశాల విద్యకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్ర మంలోనే కొన్నేళ్లుగా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. పాఠ్యాంశాల బోధనలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల, పీఎంశ్రీ లాంటి పథకాల అమలులో భాగంగా వివిధ రకాల సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోనూ అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు అందుబాటులోకి తేవడంలో భాగంగా ప్రతీ బడికి మూడు చొప్పున అత్యంత వి లువైన ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ (ఐఎఫ్‌పీ) టీవీ లను 2023–24 విద్యాసంవత్సరం నుంచి విడతల వారీగా పంపిణీ చేస్తున్నారు. 8, 9, 10 తరగతుల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో నాణ్య మైన రీతిలో పాఠ్యాంశాలు బోధించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. తాజాగా వీటిని వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇ చ్చారు. మరోవైపు కొన్ని పాఠశాలల్లో ఐఎఫ్‌పీలను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గుర్తించి ఇటీవల ప్రత్యేక కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో ఆమె అన్ని పాఠశాలల్లోని ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ బో ర్డుల ద్వారానే ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

వినియోగంపై శిక్షణ

రెండేళ్లుగా ఆయా పాఠశాలల్లో తెరపాఠాలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల వీటి వినియోగంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి తీ సుకెళ్లారు. మరోవైపు అన్ని పాఠశాలలకు ఇంటర్నె ట్‌ వసతి లేకపోవడం కూడా అంతరాయానికి కారణమవుతోంది. ఉపాధ్యాయులందరికీ వీటి విని యోగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తా జాగా సబ్జెక్టుల వారీగా రెండు రోజులపాటు జిల్లావ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

హైస్కూళ్లలో బోధనకు ఐఎఫ్‌పీలు

ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ

అఽర్థవంత అభ్యసనకు తోడ్పాటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement