అంగన్‌వాడీ కేంద్రాలకు నిధులు
● రూ.77.70 లక్షలు మంజూరు ● అప్‌గ్రెడ్ కానున్న 10 కేంద్రాలు ● 50 సెంటర్లలో తాగునీటి వసతి ● 170 మరుగుదొడ్ల నిర్మాణాలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. 10 అంగన్‌వాడీ కేంద్రాలు, 50 సెంటర్లలో తాగునీటి వసతి కల్పించనున్నారు. 170 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు జిల్లా శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం ఇటీవల రూ.77.70 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులను సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ ద్వారా చేపట్టనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి లేకపోవడంతో విద్యార్థులతోపాటు టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు జిల్లాలోని 50 అంగన్‌వాడీ సెంటర్లలో తాగునీటి వసతి కల్పించనున్నారు. గతంలో కేంద్రాలకు మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం చేపట్టినప్పటికీ నీరు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో సెంటర్‌కు రూ.17వేల చొప్పున 50 సెంటర్ల కు తాగునీటి వసతి కల్పించడానికి రూ.8.50 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సరై న మరుగుదొడ్లు లేవు. టీచర్లు, ఆయాలు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం 170 టాయిలెట్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఒక్కోదానికి రూ.36వేలు కేటాయిస్తూ రూ.62.20 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు తర్వలో ప్రారంభించి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
10 మోడల్ కేంద్రాలకు..
జిల్లాలోని అష్ట–1, బాసర–3, కుంసర, మాలేగం–1, సారంగపూర్–1, సోన్–3, న్యూ పోచంపాడు, లింగాపూర్, పెంబి–1, చింతాల్‌పేట్ అంగన్‌డీ కేంద్రాలను మోడల్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు ఒక్కో కేంద్రానికి రూ.2లక్షల చొప్పున కేటాయించారు. ఈ 10 కేంద్రాలకు గతంలోనే మొదటి విడతగా ఒక్కోదానికి రూ.1.20 లక్షలు కేటాయించగా, రెండో విడత రూ.80వేలు మంజూరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment