ఘనంగా సేవాలాల్ జయంతి
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, పూజారి సంతోష్ మహరాజ్ పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ జీవితం ఆచరణీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంజారా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ డాక్టర్ అజయ్ రేవల్లి, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ విజయ్‌కుమార్, శ్యాంబాబు, మోతీలాల్, బలరాంనాయక్, తులసీరామ్, శంకర్‌నాయక్, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఘనంగా సేవాలాల్ జయంతి
Comments
Please login to add a commentAdd a comment