పాఠ్యాంశాల బోధనలో విద్యార్థికి ఉపన్యాస పద్ధతిలో బోధించే కంటే ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ బోధించడం ద్వారా సమగ్ర అవగాహన కలగడమే కాకుండా పూర్తిస్థాయిలో మనసులో ముద్రించబడుతుంది. తద్వారా నేర్చుకోవాల్సిన పాఠ్యాంశం కూడా సులువుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా, కాంప్లెక్స్ స్థాయి శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రాలతోపాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ ఉపాధ్యాయులకు కూడా వీటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. భాషా సంబంధిత అంశాలు, సబ్జెక్టులన్నీ వీటి ద్వారానే బోధించాలని జిల్లా విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో బ్లాక్ బోర్డుల స్థానంలో ఐఎఫ్‌సీ ప్యానెల్ బోర్డులే వినియోగించేలా చర్యలు చేపడుతున్నారు. సమగ్ర శిక్షా ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ వినియోగంపై ప్రతీ సబ్జెక్టులో మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీరు కాంప్లెక్స్ స్థాయిలో ఈ నెల 11, 12 తేదీల్లో సబ్జెక్టుల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment