నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ బా లికల ఆశ్రమోన్నత పాఠశాలలో సోమవారం పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల ను తనిఖీ బృందం సభ్యులు పరిశీలించారు. టీం లీడర్ దశరథ్, సభ్యుడు లక్ష్మణ్ ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు చేశారు. హెచ్‌ఎం తుకారాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కుంటాల: నిర్మల్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 15న రాష్ట్రస్థాయి అండర్–14 అథ్లెటిక్స్ రన్నింగ్ పోటీలు నిర్వహించగా, మండల కేంద్రంలోని విజయసాయి పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థి జాదవ్ జలేందర్ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచాడు. ఈనెల 18నుంచి 20వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌ లి స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జలేందర్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ స్వప్న, పీఈటీ రాథోడ్ అరవింద్ తెలిపారు. సోమవారం విద్యార్థిని అభినందించారు.
ఇసుక వేలం
నిర్మల్‌చైన్‌గేట్: ఇటీవల నిర్మల్ రూరల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పట్టుబడ్డ 35 ట్రాక్టర్ల ఇసుకకు సోమవారం మంజులాపూర్ సమీపంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో వేలం నిర్వహించారు. వేలంలో షేక్ ముబీన్ రూ.64,700కు ఇసుకను దక్కించుకున్నాడు. తహసీల్దార్ సంతోష్‌కుమార్, ఆర్‌ఐ విజయ్‌కుమార్, ఎస్సై లింబాద్రి పాల్గొన్నారు.
‘కేంద్రానిది ప్రజావ్యతిరేక బడ్జెట్’
నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర ప్రభుత్వానిది ప్రజావ్యతిరేక బడ్జెట్ అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్ ఆరోపించారు. దీనిపై ఈ నెల 18, 19 తే దీల్లో వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జి ల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం ఎస్.కై లాస్ అధ్యక్షతన సోమవారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా విలాస్, జిల్లా సహాయ కార్యదర్శి ఉపాలి హాజరయ్యారు. విలాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి న రేందర్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కు ఆదరణ పెరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో జరుగుతున్న అవకతవకలను నిరసిస్తూ త్వరలో కడెం, దస్తురాబాద్ మండలాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్కీమ్ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల ని, సివిల్ సప్లయ్ హమాలీల బకాయిలు, భవ న నిర్మాణ కార్మికులకు రూ.7,500 పెన్షన్ చె ల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు భూ క్యా రమేశ్, లక్ష్మణ్, సోమేశ్, బాదర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment