
నిర్మల్
కూరగాయల ‘నగర్’
లోకేశ్వరం మండలం నగర్‌తండా వాసులు సీజన్‌తో సంబంధం లేకుండా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా మంచి ఆదాయం గడిస్తున్నారు.
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
9లోu
నేటి నుంచి ‘పోస్ట్’ ఉద్యమం
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ఉద్యమకారుల కు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా మంగళవారం నుంచి పోస్టుకార్డుల ఉద్య మం చేపట్టనున్నట్లు ఉమ్మడి జిల్లా చైర్మన్ కొట్టె శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ ఏ ర్పాటు, ప్రతీ ఉద్యమకారునికి 250 చదరపు గజాల ఇంటి స్థలం, పెన్షన్, బస్సు ప్రయాణాల్లో రాయితీ, అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ తదితర డిమాండ్లతో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టినట్లు పే ర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ తెలంగాణ ఉద్యమకారుడు తమ ఆశలు, ఆకాంక్షలను సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా నివేదించాలని కోరారు.
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతుండగా.. మరోవైపు కులగణన రీసర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అయోమయం నెలకొంది. ఈనెల 15వ తేదీలోపు పరిషత్, ఆ తరువాత గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయి తే కులగణలో పాల్గొనని వారికోసం ఈనెల 16నుంచి 28వ తేదీ వరకు రీసర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వ ప్రకటన, అసెంబ్లీలో బిల్లు పెట్ట డం, గవర్నర్ ఆమోదం ఇవన్నీ చూస్తుంటే.. ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
తుది దశకు ఏర్పాట్లు
మార్చి రెండో వారం నాటికి ప్రాదేశిక, సర్పంచ్ ఎ న్నికలు ముగించాలని ప్రభుత్వం మొదట భావించింది. అందుకు తగ్గట్లుగానే యంత్రాంగం ఎన్నిక ల ఏర్పాట్లలో తలమునకలైంది. ఇప్పటికే ఓటర్లు తుది జాబితాను ప్రదర్శించింది. అలాగే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, నామినేషన్ పత్రాలు జిల్లాకు చేరాయి. రెండు రోజుల క్రితం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. కలెక్టర్, అధికారులు నేరుగా పో లింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడమే మిగిలి ఉంది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల బరిలో నిలువాలన్న ఆశావహుల్లోనూ నిరాశ నెలకొంది.
ఊరించి.. ఉసూరుమనిపించి..
స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు అంతా సిద్ధమవడంతో కొద్ది రోజుల క్రితం జిల్లాలో రాజకీయ వాతా వరణం వేడెక్కింది. పంచాయతీల్లో తాము మద్దతు తెలిపిన వారిని గెలుపించుకోవడం, పార్టీ గుర్తులతో నిర్వహించే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బలనిరూపణ కోసం అన్ని పార్టీల నేతలు సవాల్‌గా తీసుకున్నారు. జిల్లాలో 400 గ్రామపంచాయతీలు, 18 జెడ్పీటీసీ స్థానాలు, 157 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తొలుత ఎంపీ టీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మె జారిటీ స్థానాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, ఆశావహులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చంటూ నేతలు, కేడర్ దిశానిర్దేశం చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీకి దిగాలని భావించినవారు ఎంత ఖర్చు చేయాలో ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి ఇప్పటికే వనరులు సమకూర్చుకున్నారు. అలాగే స్థానికులతో మమేకం కావడం, యువత మద్దతు కూడగట్టుకోవడంపై దృష్టి సారించారు. తాజాగా ప్రభుత్వం మరోసారి కులగణనకు అవకాశం ఇవ్వడంతో వేడెక్కిన రాజకీయం చప్పున చల్లారింది. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో కొందరు సర్వేలో పాల్గొనక పోవడంతో ఈనెల 28వ తేదీ వరకు మరోసారి కులగణన నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్ సర్వేతోపాటు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీవో కార్యాలయంలో నమోదు చేసుకునేలా అవకాశం కల్పించారు.
జిల్లాలోని పంచాయతీలు, పరిషత్‌లు
గ్రామపంచాయతీలు: 400
ఎంపీటీసీ స్థానాలు: 157
జెడ్పీటీసీ స్థానాలు: 18
పోలింగ్ కేంద్రాల సంఖ్య: 892
ఓటర్ల సంఖ్య: 4,50,045
అభిప్రాయ సేకరణ
భైంసాటౌన్: పట్టణంలోని జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్ర యువ వి కాసం బృందం సోమవారం సందర్శించింది. విద్యావ్యవస్థలో అభివృద్ధి చర్యలు, యు వతకు అందిస్తున్న ప్రోత్సాహంపై వివరా లు సేకరిస్తోంది. ఇందులో భాగంగా భైంసా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వసతులు, తరగతులు, విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ తదితర కార్యక్రమాలపై ప్రి న్సిపాల్ బుచ్చయ్యను అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థుల అభిప్రాయాలు సేకరించా రు. కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరించారు. డైరెక్టర్ రామారావు, కెమెరామన్ మురళి, కె మెరా అసిస్టెంట్ కామేశ్, వలీ పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
28 వరకు కొనసాగనున్న రీసర్వే
బీసీ బిల్లు ఆమోదానికి ఆలస్యం
ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం
నిరాశ, నిస్పృహల్లో ఆశావహులు
మండలం ఎంపీటీసీల పోలింగ్ ఓటర్ల
సంఖ్య కేంద్రాలు సంఖ్య
బాసర 6 31 15,720
భైంసా 11 67 33,886
దస్తురాబాద్ 5 24 12,968
దిలావర్‌పూర్ 6 34 18,708
కడెం–పెద్దూర్ 10 59 29,210
ఖానాపూర్ 8 48 23,655
కుభీర్ 14 86 40,666
కుంటాల 7 35 19,171
లక్ష్మణచాంద 9 49 24,475
లోకేశ్వరం 10 55 29,651
మామడ 9 52 26,099
ముధోల్ 10 53 28,719
నర్సాపూర్ (జి) 7 38 20,231
నిర్మల్ 7 45 22,756
పెంబి 5 32 10,985
సారంగపూర్ 14 77 39,549
సోన్ 8 43 21,935
తానూరు 11 64 31,751
ఓట్ల లెక్క తేలింది..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల సంఖ్య తేలింది. ఈ మేరకు సోమవారం జెడ్పీ సీఈవో గో వింద్ తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనప్పటికీ.. ఎన్నికల సామగ్రి సమకూర్చుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 892 పోలింగ్ కేంద్రాలను ప్రకటించారు. తుది జాబితా ప్రకారం 4,50,045 మంది ఓటర్లున్నారు.
మార్చి నుంచి వరుసగా పరీక్షలు
మార్చి 18నుంచి పదోతరగతి పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. ఈ పరీక్షలు ముగియగా నే ప్రైమరీ, సెకండరీ స్కూల్ విద్యార్థులకు పరీ క్షలు మొదలవుతాయి. ఎన్నికల ప్రక్రియలో కీ లకమైన ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో బిజీగా ఉంటారు. ఈనెల కులగణన రీసర్వే పూర్తయిన తరువాత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఈ తరువాత అసెంబ్లీలో, గవర్నర్ చేత బిల్లు ఆమోదింపజేయాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశముంది. మరోవైపు ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment