ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాకు చేరుకున్న పోలింగ్ సామగ్రికి సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూట్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులతో కలిసి అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకునే దారి, దూరం, పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు పట్టే సమయం తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని కేంద్రాల్లో దివ్యాంగ ఓటర్ల కోసం ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది సామగ్రి తరలింపునకు సంబంధించిన వాహనాలను సమకూర్చుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి మరోసారి శిక్షణ నిర్వహించి నమూనా ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్ కుమార్, నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, జెడ్పీసీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఎకై ్స జ్ అధికారి ఎంఏ రజాక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను మరోసారి ప్రథమ స్థానంలో నిలుపాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సెస్సీ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య, సిలబస్, ప్రత్యేక తరగతులు, సన్నద్ధత తదితర అంశాల గురించి పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఎస్వోలతో చర్చించి కీలక సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం నివేదికల ను ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, ఎంఈవోలు పాల్గొన్నారు.
పీఎంశ్రీ నిధుల వినియోగంపై సమీక్ష
పీఎంశ్రీ నిధుల వినియోగంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష నిర్వహించారు. పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు గురించి హెచ్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. పీఎంశ్రీ నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. ని ధులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. డీఈవో రామారావు తదితరులున్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment