ఇందిరమ్మకు ఇసుకెట్ల?
నిర్మల్
● జిల్లాలో యథేచ్ఛగా అక్రమ రవాణా.. ● స్వర్ణ, కడెం, గోదావరిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ● అధికారులు దాడులు చేస్తున్నా లెక్కచేయని వైనం..
నిధుల్లేవ్..విధులకు రారు!
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలై ఏడాది గడిచింది. రెండు నుంచి మూడు గ్రామాలకో ప్రత్యేకాధికారిని నియమించారు. పనిభారంతతో పర్యవేక్షణ లోపించింది.
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
8లోu
కొలాంగూడలో నాబార్డు డీడీఎం పర్యటన
ఖానాపూర్: మండలంలోని కొలాంగూడ గ్రామంలో నాబార్డు డీడీఎం వీరభద్ర మంగళవారం పర్యటించారు. గ్రామానికి చెంది న ఆదివాసీ మహిళలతో సమావేశమై మహిళల జీవనోపాధులపై చర్చించారు. అవాల్ రూరల్ లైవ్‌లీ హుడ్ ఎంపవర్‌మెంట్ సొసైటీతోపాటు ఐకేపీ, నాబార్డు సహకారంతో మహిళలకు వెదురుతో అల్లికలు, తయారీపై అవగాహన కల్పించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేపట్టిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. అవాల్ రూరల్ లైవ్‌లీహుడ్ సీఈ వో బండారి రమేశ్, వీవోఏ బాదావత్ రవి, ఫీల్డ్ అసిస్టెంట్ పీర్య పాల్గొన్నారు.
నిర్మల్:రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జనవరి 26న ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. సొంత స్థలం ఉన్నవారి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పన జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే.. జిల్లాలో సాగుతున్న ఇసుక దోపిడీతో ఇళ్ల నిర్మాణానికి కూడా దొరికే పరిస్థితి లేదు. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో పోలీసు–రెవెన్యూ శాఖలు చేపట్టిన దాడుల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 221 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. తాజాగా ఇసుక అక్రమ రవాణాపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా అధికారులు దాడులు మరింత ఉధృతం చేశారు. అయినా.. జిల్లాలో అక్రమ దందా ఆగడం లేదు. కాళేశ్వరం, చెన్నూరు రీచ్‌ల నుంచి అనుమతులతో తీసుకువచ్చేది కొంతే.. జిల్లాలో గోదావరి, కడెం, స్వర్ణ, సుద్దవాగుల నుంచి కొల్లగొట్టేది కొండంత.
స్వర్ణమ్మను చెరబట్టి..
శీతాకాలం సీజన్ వచ్చిందంటే చాలు.. స్వర్ణనదికి నరకమే. గోదావరికి ఉపనదిలా ఉన్న ఈ వాగు పొడవునా ఇసుక తవ్వకాలే. సారంగపూర్, నిర్మల్‌రూరల్, సోన్‌మండలాల్లోని చాలా గ్రామాల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండానే యంత్రాలు, ట్రాక్టర్లతో తరలించేస్తున్నారు. వీడీసీల ఆధ్వర్యంలో వేలం వేస్తున్నారు. వాటికి డబ్బులు కట్టినవాళ్లు దర్జాగా వాగుల్లో ఇసుకను తోడేస్తున్నారు. వర్షకాలం ముగిసి నీటి ప్రవాహాలు, చెక్‌డ్యామ్‌ల వద్ద నీటిమట్టం తగ్గగానే దందా జోరందుకుంటోంది.
అక్కడే అనుమతి..
జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క ఇసుక రీచ్ కూడా లేదు. ఎందుకంటే.. ఆస్థాయిలో ఇక్కడ ఇసుక లభ్యత ఉండదు. అయినా ప్రమాదకరంగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇక.. స్థానిక, అధికారిక అవసరాల కోసం మాత్రం జిల్లాలో నాలుగుచోట్ల తీసుకునేందుకు అనుమతిచ్చారు. భైంసా డివిజన్‌లోని సాథ్‌గాం, హద్‌గాం, పేండ్‌పల్లి, నిర్మల్ డివిజన్‌లో వెంగ్వాపేట్ గ్రామాల్లో మాత్రమే ఇసుకను తీసుకునేందుకు అధికారులు అనుమతిచ్చారు. కానీ.. చాలా గ్రామాల్లో వీడీసీలను అడ్డుపెట్టుకుని ఇసుక వ్యాపారులు వాగులు, నదులను కొల్లగొడుతున్నారు.
గోదావరిలో నుంచి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న ఇసుక
నేడు బైక్ ర్యాలీ
నిర్మల్‌టౌన్: ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శివాజీ సేవాసమితి జిల్లా సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మాట్లాడారు. ఈ ర్యాలీ స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై అంబేద్కర్ చౌక్ మీదుగా శివాజీ చౌక్‌కు చేరుకుంటుందని తెలిపారు. ర్యాలీ లో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రాంత గోసేవా ప్రముఖ్ వెంకట్ నివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో శివాజీ సేవాసమితి సభ్యులు మెడిసెమ్మ రాజు, మూర్తి ప్రభాకర్, సామనపల్లి రాఘవులు, బొడ్డు లక్ష్మణ్, గోజ్జా జనార్దన్, పొలిశెట్టి విలాస్, వెంకటపతి, సీతారాం పటేల్, కేఎస్.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లాలో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడానికి లేదు. అనుమతి లేకుండా ఎక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టినా చర్యలు చేపడతాం. ఇటీవల పట్టుకున్న ఇసుకను వేలం వేస్తున్నాం.
– కిశోర్‌కుమార్, అడిషనల్ కలెక్టర్
కేసులు నమోదు చేస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాపై పోలీసుశాఖ సీరియస్‌గా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశాం. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇసుక సీజ్ చేయించాం.
– జానకీషర్మిల, ఎస్పీ
కడెం, సుద్దవాగుల్లోనూ..
జిల్లాలో ప్రధాన జలవనరులైన కడెం, సుద్దవాగుల్లోనూ ఇసుకదందా సాగుతూనే ఉంది. సుద్దవాగుతో పోలిస్తే.. కడెంలోనే ఈ దోపిడీ ఎక్కువగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కడెం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో నీటిమట్టం తగ్గగానే అటవీప్రాంతం నుంచే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడా.. అధికారులు దృష్టిపెట్టినప్పుడు నిలిపేస్తూ.. మళ్లీ దందా యథావిధిగా సాగిస్తున్నారు.
గోదావరి పొడవునా..
జిల్లాలో బాసర నుంచి దస్తురాబాద్ వరకు గోదావరి నది పరీవాహకం ఉంది. ప్రధానంగా సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, దస్తురాబాద్ మండలాల్లో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. మొన్నటి వరకు కడెం మండలం చిట్యాల, లింగాపూర్, బెల్లాల్ సమీపంలోని గోదావరిలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. ఖానాపూర్ మండలం సోమార్‌పేట్, బీర్నంది, గాంధీనగర్ దగ్గర వాగుల్లోనూ ఇదే పరిస్థితి. దస్తురాబాద్ మండలం గొడిసిర్యాల, భూత్కూర్‌లలోనూ ఇసుక తవ్వకాలు కొనసాగుతుంటాయి. కమల్‌కోట్, మామడల్లోనూ ఇసుకదందా సాగుతోంది. ఇక అటవీ, పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేయడంతో తవ్వకాలు కొన్నిరోజులు ఆగాయి. తాజాగా దందా మళ్లీ జోరందుకుంది.
ఇందిరమ్మకు ఇసుకెట్ల?
ఇందిరమ్మకు ఇసుకెట్ల?
Comments
Please login to add a commentAdd a comment