జిల్లాకు సీఎం
నిర్మల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు రా నున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న పట్టభద్రులతో సమావేశం కానున్నా రు. నిర్మల్‌రూరల్ మండలం కొండాపూర్‌లో గల చంద్రశేఖర్ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు పే ర్కొన్నారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా నిర్మల్‌సభకు వచ్చిన ముఖ్య మంత్రి ఆ తర్వాత మళ్లీ జిల్లాకు రాలేదు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికే సీఎం జిల్లాకు రానుండటం గమనార్హం. మరోవైపు పట్టభద్రుల స్థానాన్ని దక్కించుకునేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు వర్గాలు, విబేధాలు పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి పాల్గొనే సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.
బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకే!
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇ క జిల్లాలో మూడు నియోజకవర్గాలకు గాను ప్రధానమైన నిర్మల్, ముధోల్ రెండుచోట్ల బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలు మాత్రమే జిల్లాలో ఉన్నాయి. బీజేపీ ప్రభావం తగ్గించడంలో భాగంగా ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి సమావేశం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తె లుస్తోంది. ఈ నెల 24న సోమవారం మధ్యాహ్నం 12గంటలకు కొండాపూర్‌లోని చంద్రశేఖర్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సమావేశాన్ని పట్టభద్రుల కోసమే నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
చేతులు కలిపిన నేతలు
ఒకే పార్టీలో ఉంటున్నా.. ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలు ఒక్కతాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ లో వర్గాలుగా విడిపోయినవారిని ఒకరకంగా ఎమ్మె ల్సీ ఎన్నికలు ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి. డీసీ సీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీమంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పా ల గణేశ్‌చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అర్జుమంద్‌అలీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఒకే వేదికపైకి వచ్చారు. తాజాగా శుక్రవారం ని ర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ వారంతా కలిసే పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
ఎన్నికల ప్రచారానికే..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి రెండోసారి జిల్లాకు రానున్నారు. పార్ల మెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024 మే 5న జిల్లాకేంద్రానికి వచ్చారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు ఆయన కూడా బహిరంగసభలో పాల్గొన్నారు. దాదాపు పదినెలల తర్వాత సీఎం జిల్లాకు రానున్నారు. కానీ.. ఈసారి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగానే వస్తుండటం గమనార్హం. ఎ మ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగానే కొండాపూర్‌లో సమావేశం కొనసాగనుంది. ముఖ్యమంత్రిగా రెండోసారి వస్తున్నా.. జిల్లాకు ఏం లాభం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడూ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆయన జిల్లాకు వస్తుండగా ఎలాంటి అభివృద్ధి పనులకు అవకాశం లేదు.
24న నిర్మల్‌లో పట్టభద్రులతో
సమావేశం కానున్న రేవంత్‌రెడ్డి
నరేందర్‌రెడ్డి కోసం ప్రచారం
సక్సెస్‌కు నాయకుల కసరత్తు
సమావేశం విజయవంతం చేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారని డీ సీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు పేర్కొన్నా రు. కొండాపూర్‌లోని చంద్రశేఖర్ కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించే సమావేశానికి పట్టభద్రులు తరలిరావాలని కోరారు. స్థా నిక మారుతీఇన్‌లో శుక్రవారం విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, మాజీమంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మా ట్లాడారు. నిరుద్యోగుల పక్షాన పోరాడింది కాంగ్రెస్ ఒక్కటేనని, అందుకే రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్లు ఇచ్చి, ఇప్పటివరకు 55వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఇ ప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ, ఏఎంసీ చైర్మన్లు భీంరెడ్డి, హాది, మున్సి పల్, గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్లు అప్పాల గణేశ్‌చక్రవర్తి, గండ్రత్ ఈశ్వర్, ఎర్రవోతు రా జేందర్, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఎంబడి రాజేశ్వర్, నాందేడపు చిన్ను, అజర్, జునై ద్, రవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు సీఎం
Comments
Please login to add a commentAdd a comment