నిర్మల్‌చైన్‌గేట్: వేసవిలో ప్రజలకు తాగునీటి సమ స్య రానివ్వొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీటి పొదుపు, వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పీహెచ్‌సీల్లో సరిపడా మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి నాగిని భాను, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో రాజేందర్, జేఏవో అంజిప్రసాద్, డీసీహెచ్‌వో సురేశ్, కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ అధికారులు, సిబ్బంది గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment