బాధితులకు అండగా ఉంటాం
పెంబి: అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ పే ర్కొన్నారు. మండలంలోని రాయదారి గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇండ్లు కాలిపోగా బాధితులను శుక్రవారం పరామర్శించారు. దుస్తులు, నిత్యావసరాలు అందించారు. తక్షణసాయంగా బాధితుల ఖాతాల్లో శనివారం రూ.లక్ష జమ చేస్తామని తెలి పారు. బాధితులు యఽథాస్థితికి వచ్చేదాకా భోజనం అందించాలని, బస చేసేందుకు తగిన ఏర్పాట్లు చే యాలని అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూ రుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు అ వసరమై వివరాలు సేకరించాలని తెలిపారు. అనంతరం బాధితులతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, డీఎస్వో కిరణ్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమాకాంత్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment