సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
లోకేశ్వరం: వ్యవసాయానికి విద్యుత్ కోత విధిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మండలంలోని మన్మద్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. సబ్‌స్టేషన్ పరిధిలోని హవర్గ, మన్మద్, సాథ్‌గాం, ఎడ్ధూర్, పోట్‌పల్లి, బిలోలి గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ను ప్రతీరోజు రెండు గంటల పాటు నిలిపివేస్తున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న లోకేశ్వరం ఏఈ శివకుమార్ సబ్‌స్టేషన్‌కు చేరుకున్నారు. త్రీఫేజ్ సరఫరాలో ఎంత సమ యం అంతరాయమేర్పడితే అంత సమయం రాత్రివేళ సరఫరా చేస్తామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment