‘సదరం’.. సరళతరం
వాతావరణం ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం కూడా తగ్గుతుంది.
● దివ్యాంగులకు ప్రత్యేకంగా యూడీఐడీ పోర్టల్ ● సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. ● కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నిర్మల్‌ఖిల్లా: ప్రత్యేక వైకల్యగుర్తింపు (సదరం)కార్డు కోసం యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, వీఎల్‌ఈ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యూడీఐడీ పోర్టల్, సొంత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. క్యాంపుల వివరాలు కూడా మెసేజ్‌ల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను ఈనెల నుంచే అమల్లోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. 21 రకాల వైకల్యం కలిగిన వారు యూడీఐడీ(యూనిక్ డిజేబిలిటీ ఐడీ) కార్డును పొందవచ్చని తెలిపారు. ఇదివరకే సదరం ధ్రువీకరణ పత్రం ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో
సోలార్‌ప్లాంట్ల ఏర్పాటు..
పీఎం కుసుం ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణ మహిళా సంఘాలను ప్రోత్సహించాలని దివ్య దేవరాజన్ సూచించారు. ఆసక్తి, అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో విజయలక్ష్మి, ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment