● డీఈవో రామారావు
నిర్మల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో పొరపాట్లు జరగకుండా చూడాలని డీఈవో రామారావు సూచించారు. కలెక్టరేట్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎస్, డీవోలతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈ వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ప్రకారం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రంలో వసతులు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని తెలిపా రు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు నిషేధమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రశ్న పత్రాలు తీసుకురావడం, జవాబు పత్రాలు తరలింపు జాగ్రత్తగా పోలీస్ సమక్షంలో జరగాలని సూచించారు. మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ జరగకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పద్మ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి కొత్తగా 24 పేజీల జవాబు పత్రాల బుక్లెట్ ఇస్తామన్నారు. వెంకటరమణ, సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్, డీసీఈబీ సహాయ కార్యదర్శి భానుమూర్తి, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment