● పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్
నిర్మల్ రూరల్: రాష్ట్రంలో వెంటిలేషన్‌పై ఉన్న విద్యారంగాన్ని కాపాడేందుకు రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగం నిధుల కొరతతో మౌలిక వసతులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాలంటే 15 శాతం నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం హామీలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రతీ విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట రాజ్, నరేశ్, నవీన్, లోకేశ్ తదితరులు ఉన్నారు.
మాట్లాడుతున్న వెంకటేశ్
Comments
Please login to add a commentAdd a comment