నిర్మల్ లయన్స్ క్లబ్‌కు పురస్కారాలు
నిర్మల్‌ఖిల్లా: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ కాన్ఫరెన్స్‌లో నిర్మల్ లయన్స్ క్లబ్‌కు పలు పురస్కారాలు దక్కాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రాంతీయస్థాయి కాన్ఫరెన్స్‌లో లయన్స్ క్లబ్ వివిధ రంగాల్లో చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా పురస్కారాలు ప్రదానం చేసినట్లు నిర్మల్ అధ్యక్షుడు కె.చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ సామాజిక సేవా కార్యక్రమాల విభాగంలో క్లబ్ కేటగిరీలో ఎక్సెలెంట్ క్లబ్ అవార్డుతోపాటు మూడు పురస్కారాలు.. వ్యక్తిగత విభాగంలో ఐదు పురస్కారాలు అందించారు.. పురస్కారాలు స్వీకరించిన వారిలో కె.చంద్రమోహన్‌రెడ్డి(ఉత్తమ అధ్యక్షుడు), శ్రీనివాస్‌యాదవ్(ఉత్తమ కార్యదర్శి), లక్ష్మీనారాయణగౌడ్(ఉత్తమ కోశాధికారి), వట్టిమల్ల నరసయ్య(రీజియన్ సెక్రెటరీ), లక్కడి రాజేశ్వర్‌రెడ్డి(జోన్ చైర్మన్) తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ డీకే.రాజేశ్ శాలువా, మెమొంటోలతో సత్కరించారు. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలోని పలు గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment