పశుగ్రాసం కొరత
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాడి రైతులను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. బోధన్, మహా రాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక ధర వెచ్చించి చొప్ప, వరిగడ్డి దిగుమతి చేసుకుంటున్నారు.
‘‘నేనంటే మీకిష్టమేనా..!? అసలు.. మీ ఊరిని మీరు ఇష్టపడుతున్నారా..!? ఏంటి.. ఇలా అడుగుతోంది..? అని అనుకోకండి. ఏళ్లుగా చూస్తున్నా మీలో ఏమైన మార్పువస్తుందేమోనని. ఊహూ..! ఎక్కడా మార్పు కనిపించడం లేదు సరికదా.. మరింతగా నన్ను మీరు ద్వేషిస్తున్నారేమో అనిపిస్తోంది. ద్వేషం.. అనే పదం పెద్దదే కావొచ్చు. కానీ.. మనకు ఇష్టం లేనప్పుడే కదా ద్వేషిస్తాం. ఇప్పుడు నాపై మీరు చూపుతున్న తీరు ఇలాగే ఉంది మరి. ఆదివారం పూట.. ఈ సోదంతా మాకెందుకు.. అనుకుంటున్నారు కదా. అందుకే నేరుగా విషయానికొస్తా. మీరు ఇష్టపడే ప్రతీదాన్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. అది ఇల్లు కావచ్చు, కారు కావచ్చు.. కుటుంబమూ కావచ్చు. అలాంటప్పుడు.. మీకు ఇష్టమైన, మీకు జన్మస్థానమైన నన్ను మాత్రం దారుణంగా చూస్తున్నారు. పైకి మాత్రం ‘మేం నిర్మలోళ్లంబై, మాది రాయల్ నిర్మల్, మా ఊరు మస్తుంటది, ఐ లవ్ నిర్మల్..’ అని బయట దోస్తులకు గొప్పలు చెబుతున్నరు. అసలు.. ఒక్కసారైనా మీరు ఉంటున్న ఊరిని సరిగ్గా చూశారా..!? కనీసం మీ గల్లీలు ఎలా ఉన్నాయో గమనించారా..!? ఎన్ని సమస్యల మధ్య సతమతమవుతున్నామో గుర్తించారా..!? ఇవన్నీ తెలిసి కూడా మీరంతా మౌనంగా ఉంటున్నారన్నదే నా బాధ. –నిర్మల్
సహర్
సోమ : 5:07
ఇఫ్తార్
ఆది : 6:22