ఖానాపూర్: కోర్టు కేసుల్లో సాక్షులు కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.. ఖానాపూర్‌లో న్యాయస్థానమే సాక్షివద్దకు వెళ్లి సాక్ష్యాధారాలు తీసుకుంది. ఖానాపూర్ మండలం బావాపూర్(ఆర్) గ్రామంలో గతంలో జరిగిన గొడవతో కేసు నమోదైంది. కేసు చివరి దశలో ఉన్న సమయంలో కేసును వాదించే న్యాయవాది రమణరావు కాలి గాయంతో నడవలేని స్థితిలో ఉన్న సాక్షిని కోర్టు ఆదేశాల మేరకు ఆటోలో కోర్టు ఆవరణ వరకు తీసుకొచ్చాడు. కోర్టు లోపలికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవేందర్‌తోపాటు సదరు న్యాయవాది ఈ విషయం జడ్జి జితిన్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి నేరుగా కోర్టు ఆవరణలో ఆటోలో ఉన్న సాక్షి వద్దకు వచ్చి భయాన స్టేట్‌మెంట్ తీసుకున్నారు.