● లెక్క తేలని ధాన్యం సుమారు 12,202 మెట్రిక్ టన్నులు ● గోప్యంగా తనిఖీల వివరాలు
ఖానాపూర్: మండలంలోని సత్తనపల్లి పంచాయతీ పరిధి రాంరెడ్డి పల్లె గ్రామంలోని ఏఆర్‌ఎస్ ఇండస్ట్రీయల్ రైస్‌మిల్‌పై స్టేట్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతోపాటు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం తనిఖీలు చేశారు. ఈ విషయం శనివారం వెలుగు చూసింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువ చేసే సుమారు 12,202 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం లెక్క తేలనట్లు గుర్తించారు. రబీ సీజన్ 2022–23, 2023–24 సంవత్సరాలకుగానూ కేటాయించిన ధాన్యంలో తేడాలు వచ్చినట్లు తెలిసింది. మిల్లులపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే తనిఖీల విషయం అధికారులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.