
అప్‌గ్రేడ్ అయ్యేదెప్పుడో!
నిర్మల్
● విస్తరించని ఏరియాస్పత్రి సేవలు ● 25 ఏళ్లయినా ఇంకా 100 పడకలే.. ● 150కి పెంచాలని ఏళ్లుగా డిమాండ్ ● జనాభా పెరిగినా సేవలు అంతంతే ● భైంసావాసులకు అరకొర వైద్యమే..
ట్రా‘ఫికర్’ తీరేదెన్నడో!
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. రోడ్లపై వాహనాలు నిలిపేవారు, రోడ్లను ఆక్రమించి చిరువ్యాపారాలు చేసేవా రితోనే సమస్య తీవ్రమవుతోంది.
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
సంస్థ అభివృద్ధికి సహకరించాలి
నిర్మల్‌టౌన్: ఆర్టీసీ అభివృద్ధికి ఉద్యోగులంతా సహకరించాలని నిర్మల్ డీఎం పండరి సూచించారు. ఆదివారం ఇటీవల డిపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన పండరిని నిర్మల్ డిపోలో సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్ రీజియన్‌లో నిర్మల్ డిపో ప్రథమ స్థానంలో ఉందని తెలిపా రు. ఈ స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క రూ అంకితభావంతో కృషి చేయాలని కోరారు. సిబ్బంది గంగాధర్, శేఖర్, నరేందర్, రమేశ్, సుజాత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
భైంసాటౌన్: డివిజన్ కేంద్రమైన భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రి సేవలు విస్తరించడంలేదు. పెరిగిన జనాభాకు తగినట్లు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడంలేదు. ఆస్పత్రి ఏర్పడి దశాబ్దాలు గడిచినా అప్పటి నుంచి 100 పడకలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం భైంసా పట్టణంతోపాటు డివిజన్ పరిధి లోని ఏడు మండలాల నుంచి రోగుల తాకిడి విపరీతంగా ఉంది. అత్యవసర సమయంలో సరైన వై ద్యం అందని పరిస్థితి నెలకొంది. జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిని ప్రభు త్వ జనరల్ హాస్పిటల్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో టీవీవీపీ ఆధ్వర్యంలో కొనసాగాల్సిన జిల్లా ఆ స్పత్రిని భైంసాలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ డివిజన్ వ్యాప్తంగా వినిపిస్తోంది.
మూడు దశాబ్దాలైనా పట్టింపేది?
కమ్యూనిటీ ఆస్పత్రిగా ఉన్న భైంసా ఆస్పత్రిని 1996లో ఏరియాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసి వంద పడకలకు పెంచారు. అప్పటి జనాభా, ఆస్పత్రికి రోగు ల తాకిడికి అనుగుణంగా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశా రు. అప్పట్లో నగర పంచాయతీగా ఉన్న భైంసా ప ట్టణం తరువాత క్రమంలో మున్సిపాలిటీగా మా రింది. ఆ తర్వాత డివిజన్‌కేంద్రంగా కూడా ఏర్పడింది. పట్టణ జనాభాతోపాటు డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకై క ప్రభుత్వ ఏరియాస్పత్రి ఇది. నిర్మల్ తర్వాత విద్య, వైద్యం, వ్యాపార, వాణిజ్య, మార్కెటింగ్ పరంగా భైంసా అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇతర జిల్లాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు నిత్యం వేలసంఖ్యలో భైంసాకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో భైంసాలోని ఏరియాస్పత్రికీ రోగుల తాకిడి విపరీతంగా ఉంటోంది. వ్యాధుల సీజన్‌లో ఆస్పత్రిలో రోజుకు సరాసరి 500–600కు పైగా ఓపీ నమోదవుతోంది.
వసతులు, సిబ్బంది అంతంతే..
భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో సరైన వసతులు, సరిపడా సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మేల్, ఫిమేల్ వార్డులు, క్యాజువాలిటీ, ఆరోగ్యశ్రీ, ఆర్థో, సర్జరీ, డెలివరీ, ఎన్‌బీఎస్‌యూ, పీడియాట్రిక్.. ఇలా తొమ్మిది విభాగాలకు షిఫ్ట్‌కు ఇద్దరేసి చొప్పున నర్సులు ఉండాల్సి ఉండగా, 19 మందే ఉన్నారు. వైద్యులూ పూర్తిస్థాయిలో లేరు. రెగ్యులర్ వైద్యులు లేక పలువురు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. డెలివరీ కేసులకు సరిపడా సిబ్బంది లేరు. సీటీ స్కాన్ సౌకర్యం లేక నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో రూ.వేలల్లో బిల్లులు వెచ్చించలేని నిరుపేదలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో రిఫర్..
డివిజన్ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలబారిన పడినవారిని భైంసాలోని ఏరియాస్పత్రికి తీసుకువస్తారు. ఆయా సందర్భాల్లో స్థానిక వైద్యులు అందుబాటులో ఉన్న వసతులతోనే చికిత్స అందిస్తున్నారు. అయితే, క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు, అత్యవసర సమయాల్లో నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందక ఎంతోమంది క్షతగాత్రులు మధ్యలోనే ప్రా ణాలొదులుతున్నారు. జిల్లాలోనే అధికంగా డెలివరీ కేసులు భైంసా ఆస్పత్రిలోనే నమోదవుతున్నాయి. వీటితోపాటు సీజనల్ వ్యాధుల సమయంలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.
బాసరలో శ్రమదానం
బాసర: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ సిబ్బంది, శ్రీ ప్రణవపీఠం పీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్‌కు చెందిన 85 మంది శిష్యులు, విశ్వనాథ్ పూ ర్ణిమ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ఆల యం, గోదావరి నది పుష్కరఘాట్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి సుదర్శన్‌గౌడ్, పర్యవేక్షకుడు, శివరాజ్, నారా యణ పటేల్, సిబ్బంది పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
జిల్లా ఆస్పత్రిగా మార్చితేనే..
జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చారు. టీవీవీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జిల్లా ఆస్పత్రిని భైంసాలోని ఏరియాస్పత్రిలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఏరియాస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ఇక్కడి ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ తర్వాత వైద్యపరంగా రోగుల తాకిడి ఎక్కువగా ఉండే భైంసా ఏరియాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వైద్యులు, సిబ్బందితోపాటు వసతులు పెరిగి ఇక్కడి ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఏరియాస్పత్రిలో పోస్టుల వివరాలు
పోస్టు మంజూరు భర్తీ ఖాళీలు
సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ 13 7 6
డిప్యూటీ సివిల్ సర్జన్ 10 3 7
సివిల్ అసిస్టెంట్ సర్జన్ 22 17 5
డిప్యూటీ డెంటల్ సర్జన్ 1 1 –
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 1 1 –
హెడ్ నర్స్ 5 5 –
స్టాఫ్ నర్స్ 26 19 7
మిడ్‌వైవ్స్ 2 – 2
ఎంపీహెచ్‌ఏ (ఎఫ్) 6 2 4
అప్‌గ్రేడ్ చేయాలి
భైంసా పట్టణం నానాటికీ విస్తరిస్తున్నా ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో సేవలందడంలేదు. పెరిగిన జనాభా, రోగుల తాకిడికి అనుగుణంగా ఏరియాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి. జిల్లా ఆస్పత్రిని భైంసాలో ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రాంతప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. – డాక్టర్ రామకృష్ణాగౌడ్,
ఆరోగ్యభారతి రాష్ట్ర సభ్యుడు
రోగులకు ఇబ్బందవుతోంది
భైంసా ఏరియాస్పత్రిలో అత్యవసర సేవలు అందడంలేదు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులో లేవు. అత్యవసర సమయాల్లో వైద్యులు ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తుండగా పేదలపై ఆర్థికభారం పడుతోంది. భైంసా ఏరియాస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి. – జె.రాజు,
సీపీఐ (ఎంఎల్) నాయకుడు, భైంసా

అప్‌గ్రేడ్ అయ్యేదెప్పుడో!

అప్‌గ్రేడ్ అయ్యేదెప్పుడో!

అప్‌గ్రేడ్ అయ్యేదెప్పుడో!

అప్‌గ్రేడ్ అయ్యేదెప్పుడో!