కడెం: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.2,500, నిరుద్యోగభృతి ఇవ్వకుండా, రైతు రుణమాఫీని పక్కాగా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని విమర్శించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి వెచ్చిస్తున్న నిధులు కేంద్ర ప్రభత్వానివేనని చెప్పారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మహిళా విభాగం జి ల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని భర్త దుర్గయ్యకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగగా అ తడిని పరామర్శించారు. ఇటీవల మరణించిన సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్, నాయకులు అమరవేని రవీందర్‌గౌడ్, మోహన్‌నాయక్, ముల్కి కృష్ణ, ప్రవీణ్, శ్రీరాం, నగేశ్, తిరుమల్ తదితరులున్నారు.